పొన్నూరు పురపాలక సంఘంలో 17వ సచివాలయం వాలంటీర్ గా పనిచేస్తున్న కే వెంకటేష్ గత నెలలో రోడ్డు ప్రమాదంకు గురై గుంటూరు నుహ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గురువారం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధ వైద్యశాలకు వెళ్లి వెంకటేష్ ను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను విజ్ఞప్తి చేశారు. అనంతరం పొన్నూరు మెప్మా సిబ్బందితోపాటు కమిషనర్ రాధా కొంత నగదు సమకూర్చి వెంకటేష్ కు ఆర్థిక సహాయం అందించారు.