ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో గుట్టుచప్పుడుగా కాకుండా పేకాట ఆడుతున్న 8 మంది జూదరులను గురువారం సాయంత్రం పెదనందిపాడు ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ సిబ్బందితో వెళ్లి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 వేల రూపాయలను స్వాధీన పరుచుకున్నారు. కేసు నమోదు చేసి త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్సై రెహమాన్ తెలిపారు.