గుంటూరు నగరంలో చుట్టుగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2, 562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, మరో 13, 573 వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు. అంతకు ముందు రైతు నాయకులతో కలిసి జగన్ ట్రాక్టర్ ఎక్కారు. కొద్దిదూరం స్వయంగా డ్రైవ్ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ అక్టోబర్లో మరో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా వ్యవసాయ యంత్రాలను అందిస్తామని ప్రకటించారు.