పోలవరం ప్రాజెక్టుపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం త్వరలో రూ.12,911 కోట్ల నిధులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దీనివల్ల 41.15 మీటర్ల ఎత్తులో నీటినిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులు అందుతాయన్నారు. దీనిపై త్వరలో కేంద్ర కేబినేట్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. పోలవరంలో పూర్తిస్థాయి నీటినిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులు, అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
![]() |
![]() |