అమెరికా తమ దేశంలోని ఐఫోన్లను హ్యాక్ చేసిందని రష్యా ఆరోపించింది. తద్వారా తమపై నిఘా పెట్టిందని, ఇందుకోసం అధునాతన టెక్నాలజీని వినియోగించందని ఆరోపించింది. ఇలా ఐఫోన్లతో తమపై అమెరికా పెట్టిన నిఘాను తాము గుర్తించామని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(FSB) వెల్లడించింది. అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ(NSA), యాపిల్ సంస్థ సంయుక్త సహకారంతోనే ఈ గూఢచార్యం జరుగుతోందని రష్యా ఎఫ్ఎస్‌బీ పేర్కొంది.