టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరకట్టపై అక్రమంగా నివాసముంటున్నారంటూ.. ఆ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దరఖాస్తు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. వాదనలు ముగిసిన తర్వాత.. ఈ నెల 6న తీర్పు ఇస్తామని తెలిపిన ఏసీబీ కోర్టు తెలిపి, కేసును వాయిదా వేసింది.