WFI చీఫ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్లో విస్తుబోయే విషయాలు బహిర్గతమయ్యాయి. తాజాగా వీటిపై ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. బ్రిజ్ భూషన్‌పై ఇప్పటికీ చర్యలెందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ‘‘మోదీ గారూ.. ఈ అభియోగాలను చదివి అటువంటి వ్యక్తిపై ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదో దేశానికి చెప్పండి’’అని అన్నారు. అయితే బ్రిజ్ తమతో అత్యంత అనుచితంగా ప్రవర్తించారని రెజ్లర్ల తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.