భారతదేశంలోని ముస్లిం వర్గం అత్యంత సురక్షితంగా ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగ్వత్ పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మాతృభూమికి భారతీయులేనన్నారు. ‘‘మతపరమైన ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ ప్రతి భారతీయుడు హిందువే. ముస్లింల ఆరాధన పద్ధతులు భిన్నంగా ఉన్నా వారందరికీ ఒకే మూలాలు ఉన్నాయి. భారతదేశంలో కంటే ఇస్లాం సురక్షితంగా ఎక్కడ ఉంది?’’ అని అన్నారు.