WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ రెజర్లు చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే స్పందించారు. ఏ మహిళ ఫిర్యాదు చేసినా దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, అనంతరం నిజమా కాదా అని పూర్తిస్థాయిలో విచారణ చేసి తుది నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. ఒకవేళ రెజ్లర్ల ఆరోపణలు నిజమైతే భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ ప్రీతమ్ ముండే అభిప్రాయపడ్డారు.