మహానాడులో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని వైసీపీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి మహానాడులో ప్రకటించారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల మేనిఫేస్టోని కాపీ కొట్టి దసరాకి ప్రకటిస్తారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో 640 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని, అనంతరం వెబ్సైట్ నుంచి తొలగించారని మండిపడ్డారు.