రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ క్రమంలో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ ను జూన్ 9వ తేదీలోగా అరెస్ట్ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేసింది. బ్రిజ్ ను అరెస్ట్ చేయకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఆ సంస్థ నాయకుడు రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. రెజ్లర్ల డిమాండును ప్రభుత్వం పరిష్కరించాలని, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలన్నారు. లేదంటే తాము జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగుతామన్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa