అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి రాజీనామా చేశారు. 2030 నాటికి భారత్‌లో క్లౌడ్ వ్యాపారంలో 12.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని అమెజాన్ యోచిస్తోంది. చందోక్ 2019లో అమెరికన్ టెక్ దిగ్గజం క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్లో చేరారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో అనుభవం ఉన్న ఆయన రాజీనామా చేయడం కంపెనీకి భారీ దెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.