చమురు ఉత్పత్తుల గరిష్ట రిటైల్ ధరలను (ఎంఆర్‌పి) తగ్గించాలని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ (డిఎఫ్‌పిడి) శుక్రవారం ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో లీటరుకు రూ.8 నుంచి రూ.12 వరకు తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను కోరింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA)తో సహా ప్రధాన పరిశ్రమ సంస్థలతో జరిగిన సమావేశంలో ఖర్చు ప్రయోజనాలను తక్షణమే వినియోగదారులకు అందించాలని తెలిపింది.
ఒక నెల క్రితం ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లతో జరిగిన సమావేశంలో... DFPD శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్ మరియు రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ యొక్క ప్రధాన బ్రాండ్‌లపై లీటరుకు రూ.5 నుండి రూ.15 వరకు తగ్గించాలని సూచించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని కేంద్రం భావిస్తోంది. 2021-22లో వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయంగా, ఈ ధరలు జూన్ 2022 నుండి తగ్గుతున్నాయి.అయితే అంతర్జాతీయ ధరల కంటే దేశీయంగా ధరలు తగ్గడం లేదని కేంద్రం అభిప్రాయపడింది. కాబట్టి వెంటనే ధరలను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు సూచించాయి. లీటరుకు రూ.8 నుంచి రూ.12కి తగ్గించాలని తెలిపారు.