కిడ్నీల్లో రాళ్లు ఎప్పుడు చేరతాయో చెప్పడం కష్టం. అవి ముదిరితే శస్త్ర చికిత్స వరకూ చేరుతుంది. కిడ్నీల్లో రాళ్లు చేరితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పొత్తి కడుపులో నొప్పి, మూత్ర పిండాల వెనుక భాగంలో ఆకస్మికంగా నొప్పి వచ్చి పోతుందని అంటున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. మూత్రం కూడా గులాబీ లేదా ఎరుపు రంగులో మారుతుందని పేర్కొంటున్నారు. ఆకస్మికంగా జ్వరం వచ్చి తగ్గుతుందని, వాంతులవుతుంటాయని చెబుతున్నారు. ఎక్కువగా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.