ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 280 మంది మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 35 మంది తమిళనాడు వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం నేడు సంతాపదినంగా ప్రకటించింది. నేడు జరిగే అధకారిక కార్యక్రమాలను రద్దు చేసింది. మరోవైపు, సీఎం స్టాలిన్ చెన్నైలోని మానిటరింగ్ సెంటర్ ను సందర్శించి రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలపై ఆరాతీశారు.