ఒడిశా రైళ్ల ప్రమాద ఘటనలో ఏపీ ప్రయాణికుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీసింది. యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ డివిజన్‌కు చెందిన 52 మంది ఉన్నట్లు గుర్తించారు. కోరమండల్ రైలులో విజయవాడ డివిజన్‌కు చెందిన 48 మంది ఉన్నట్లు సమాచారం. హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కినవారిలో బాపట్ల 2, విజయవాడ 4, చీరాల 12, గూడురు 2, నెల్లూరు 2, ఒంగోలు 2, రాజమండ్రి 2, తిరుపతికి చెందిన 18 మంది ఉన్నట్లు తెలిసింది.