టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.