ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు 280 మంది మృతిచెందారని అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన 900 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ పోలీసులు, వాలంటీర్లు, 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఓడీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.