ఒడిశాలోని బహునాగ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్టేషన్ లోని లూప్ లైన్ లో గూడ్స్ రైలు ఆగి ఉంది. ఇదే సమయంలో వచ్చిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఆ స్టేషన్ లో స్టాప్ లేకపోవడంతో మెయిన్ లైన్ కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కానీ కోరమండల్ రైలుకు లూప్ లైన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ 128 కి.మీ వేగంతో గూడ్స్ రైలును ఢీకొట్టింది.