పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు 135 అడుగులకు కుదించాలనే కుట్ర జరుగుతోందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎందుకు అన్ని పార్టీలు ఒక తాటిపైకి రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం తాము మాట్లాడితే సోషల్ మీడియాలలో ట్రోల్ చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేసారు.