ఆపదలో వున్నవారికి ఆపన్న హస్తం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ అందరికి ఉపయోగ పడుతుందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. శనివారం శాసనసభ్యుల వారి కార్యాలయంలో లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. పెదకూరపాడు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పైడాల శ్రీనివాసరావు కు మంజూరైన రూ. 1. 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అందజేశారు. అనారోగ్యంతో బాధపడే వారు, వైద్యానికి ఖర్చు పెట్టే స్థోమత లేని వారు సాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధిని ఆశ్రయించవచ్చన్నారు. పేదలకు సాయం చేసేందుకే సీఎంఆర్ఎఫ్ ఉందని ఎన్నో జీవితాలను నిలబెట్టిందన్నారు.