ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి తక్షణ సహాయం కోసం గుంటూరు జిల్లా ప్రజల కోసం గుంటూరు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజలు కంట్రోల్ రూమ్ నెంబర్ 0863 -2234014 కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు.