భార్య అలిగి పుట్టినింటికి వెళ్లి కాపురానికి రాలేదని ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి శుక్రవారం రాత్రి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు. తంబళ్లపల్లి మండలం మూలపెంటకు చెందిన లోకేష్(28)తో భార్య లక్ష్మి గొడవ పడి వారం క్రితం అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టిన ఫలితం లేకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.