రాష్ట్ర వ్యాప్తంగా శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు 8 గంటల పని విధానం అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమే్‌షబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న శానిటేషన్ కార్యదర్శులు ఎక్కువగా గర్భిణులు, చిన్న పిల్లల తల్లులు ఉన్నారని అన్నారు. అయితే మహిళలు అని చూడకుండా సమయపాలన లేకుండా ఉదయం 5.30 గంటలకు డ్యూటీకి రావాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మహిళా ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆపాలన్నారు.