బడిఈడు పిల్లలు పనిలో కాకుండా బడిలో ఉండాలని జిల్లా సహాయ కార్మిక అధికారి జగదీశ్ బాబు అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా శుక్రవారం పూతలపట్టు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దుకాణాలు, ఇటుకబట్టీలు, మెకానిక్ షాపుల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి చదువుపై అవగాహన కల్పించాలని మహిళా పోలీసులకు ఆదేశించారు.
ఎంపీడీఓ గౌరి మా ట్లాడుతూ మండల పరిధిలోని బాలకార్మికులను గుర్తించి ఈనెల 12న ప్రపంచ బాలకార్మి కుల నిర్మూలన దినోత్సవం రోజున బడికి పం పిస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కొందరు తల్లిదం డ్రులు ఇవి తెలుసుకోలేక పిల్లలను పనులకు పంపుతున్నారన్నారు.
అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న విద్యాకానుక, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్ విజయభాస్కర్, శివశంకర్, మురళి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.