భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రాలకు జియో మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్రాలకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1500 మందికి ఓటు హక్కు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, అలాగే ఒక ఇంట్లో ఉన్న వాళ్లందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు ఉండేలా చూడాలని పేర్కొంది.