తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి వద్ద యువకుడు ఎర్రంరెడ్డి(30)పై శనివారం అర్థరాత్రి ప్రత్యర్థులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఊరి చివర పొలాల్లోకి తీసుకెళ్లి నిరాయుదునిపై బండరాళ్లు, కర్రలతో దాడిచేసి హత్యాయత్నంకు పాల్పడ్డారు. కొన ఊపిరితో ఉన్న బాధితుణ్ణి గుర్తించిన పొరుగు పొలాల రైతులు 108కు సమాచారం అందించగా వారు వెంటనే బాధితుడ్ని మదనపల్లికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమించిందని తిరుపతికి రెఫర్ చేశారు.