ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ ప్రమాదంతో కలిపి ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్ గడిచిన 20 ఏళ్లలో మూడుసార్లు పట్టాలు తప్పింది. 2002 మార్చి 15న చెన్నై వెళుతున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. 2009 ఫిబ్రవరి 13న ఒడిశాలో 13 బోగీలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. తాజాగా జూన్ 2న ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైంది.