పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనానికి వచ్చిన భక్తులపై మంత్రి జోగి రమేష్ అనుచరులు దాడి చేశారు. పల్నాడు జిల్లా ఫిరంగిపురం గ్రామస్థులు రెండు బస్సుల్లో తిరుపతమ్మ దర్శనానికి రాగా, ఇబ్రహీంపట్నంకి చెందిన 8 మంది యువకులు సైతం ఆలయానికి వచ్చారు. వీరు యాత్రికులలో ఉన్న యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై బస్సులోని వారు అభ్యంతరం తెలపడంతో జాతీయ రహదారిపై కాపుకాసి దాడి చేశారు. పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్ కి తీసుకెళ్లి, కేసు నమోదు చేయకుండానే పంపించేశారు.