తిరుపతి జిల్లాలో భూహక్కు భూ రక్ష లో జరుగుతున్న రీసర్వే పనులను పక్కాగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమని 100 సంవత్సరాల తర్వాత ప్రధానంగా రైతుల భూ రికార్డులు అప్డేట్ కానున్నాయని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం రాత్రి స్థానిక కలెక్టరేట్లో జరుగుతున్న భూ రికార్డుల స్వచ్ఛకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రౌండ్ ట్రూత్ ద్వారా రీసర్వేలు నిర్ధారించిన భూ రికార్డులను తప్పులు లేకుండా కచ్చితత్వంతో వెక్టరైజేషన్ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఆన్లైన్లో రైతుల వివరాలను పొందుపరిచేటప్పుడు చిన్న పొరపాటుకు కూడా తావివ్వరాదని వీఆర్వో తాసిల్దార్ లాగిన్ ల ద్వారా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఇప్పటికే పలుమార్లు అవగాహన కల్పించారని సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు వెబ్లాంట్ తో సరిపోల్చుకొని సరి చేయాల్సి ఉంటుందని సూచించారు. రెండు రోజులపాటు సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు డివిజన్లకు సంబంధించి జరిగిన గ్రౌండ్ ట్రూతింగ్ అనంతరం జరగాల్సిన ఆన్లైన్ నమోదు సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది కంప్యూటర్ల ద్వారా లాప్టాప్ ల ద్వారా అప్లోడ్ కార్యక్రమం చేపట్టారు.