ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ధనికుల కోసం బాంబు షెల్టర్లు నిర్మించాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు మాస్కోలోని సెంట్రల్ ఆసుపత్రిలో వీటిని నిర్మించాలని పుతిన్ ఆదేశాలిచ్చారు. $431,000 వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి కావాలని పుతిన్ పేర్కొన్నారని ఆ దేశ వార్తా సంస్థ ప్రచురించింది.