ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. అయితే ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేయడంతో పాటు మరికొన్ని టైన్ల టైమింగ్స్‌ను మార్చారు. మరోవైపు ఒడిశా మీదుగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు. నేడు కూడా హైదరాబాద్-షాలిమార్(18046), సంత్రాగచ్చి-తిరుపతి(22855), తిరుపతి-సంత్రాగచ్చి(22856), హోరా- SMVT బెంగళూరు(12245), షాలిమార్-హైదరాబాద్(18045), షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(12841), వాస్కో డా గామా-హోరా(18048), వాస్కో డా గామా-కాచిగూడ(18048), హోరా-సికింద్రాబాద్(12703), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-షాలిమార్(12842), చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి(22808) ట్రైన్లను రద్దు చేశారు. ఇక హోరా-తిరుచిరాపల్లి(12663), అగర్తలా-బెంగళూరు(12504) రైళ్లను ఖరగ్‌పూర్, టాటానగర్, రూర్కెలా, ఝర్సుగూడ మీదుగా దారి మళ్లించారు.
అటు SMVT బెంగళూరు-జాసిదిహ్(22305) ట్రైన్ ఉదయం 10 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. 12.30 నిమిషాలకు మార్చారు. ఇక SMVT బెంగళూరు-హోరా(12864) రైలు ఒంటి గంటకు బయల్దేరాల్సి ఉండగా 10.35 గంటలకు, SMVT బెంగళూరు-హోరా(12246) ట్రైన్‌ను 11.20 నుంచి 1.30 గంటలకు మార్చారు. అలాగే బెంగళూరు-కామాఖ్య(12551), బెంగళూరు-బగల్పూల్(12253), వల్లిపురం-పురులియా(22606), తిరువనంతపురం-షాలిమర్(22641) ట్రైన్లు కూడా రద్దు అయ్యాయి. దిల్బర్గ్-సికింద్రాబాద్(7047), న్యూజలాయ్గిరి-చెన్నై(22612), సెలిచర్-త్రివేండ్రం(12508), తాంబరం-న్యూ తిన్సుకియా(15929), బెంగళూరు-గుహవాటి(12509), హౌరా-మైసూర్(22817) ట్రైన్లను దారి మళ్లించారు.
విజయవాడ మీదుగా వెళ్లే 51 రైళ్లు రద్దు అవ్వగా.. 29 రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. తక్కువ ట్రైన్లు తిరుగుతుండటంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. బాత్రూమ్లు, తలుపులు, కిటికీలను పట్టుకుని వేలాడుతూ ప్రయాణం చేస్తోన్నారు.