హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్‌ను బ్లాక్మార్కెట్లో రూ.200కు అమ్ముతున్నారు. వంటనూనె లీటర్ ధర రూ.250 నుంచి 280 వరకు పలుకుతోంది. బియ్యం, టమాటా, ఆలుగడ్డ మొదలైనవాటి ధరల్ని రూ.30 నుంచి రూ.40 వరకు పెంచటంతో సామాన్యులు కొనలేన పరిస్థితి నెలకొంది.