మామిడికాయ గింజల్లో పొటాషియం, సోడియం, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. మామిడిపండు గింజలను ఎండబెట్టి పొడిలా తయారు చేసుకుని నీటిలో కలిపి మిశ్రమంలా చేసి జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. గింజలను ఉడికించి తయారు చేసిన నూనెను వినియోగించే చర్మ సమస్యలు తగ్గుతాయి. మామిడి గింజలతో తయారుచేసిన చట్నీని తీసుకుంటే అధిక రక్తపోటు సమస్యలు దూరమవుతాయి.