భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో కీలక ప్రకటన చేశారు. ఒడిశా ట్రైన్ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని ప్రశంసిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఆ పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు గానూ సెహ్వాగ్ ముందుకు వచ్చారు.