అఫ్ఘానిస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో బాలికలపై విషప్రయోగం జరిగింది. సర్-ఎ- పుల్ ప్రావిన్స్ లోని సంగ్చారక్ జిల్లాలో 80 మంది బాలికలపై విషప్రయోగానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న రెండు పాఠశాలల్లో ఈ విష ప్రయోగం జరగగా, దీనికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, బాలికల ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అధికారులు వెల్లడించలేదు. మే నెలలోనూ తాగునీటిలో విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది.