బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఆదివారం ఒక ప్రకటన లో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించే 2379 మందిపై 2215 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం మరియు ఐపిసి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పోలీసుల చర్యలతో మందుబాబులు ఆరుబయట మద్యం సేవించటానికి భయపడుతున్నారు.