పెదకాకాని శివాలయంలో మొక్కులు తీర్చుకునేందుకు పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రమట్ల గ్రామానికి చెందిన సింగంశెట్టి హనుమంతరావు కుటుంబ సభ్యులతో ఆదివారం వచ్చారు. మానసిక పరిస్థితి సరిగా లేని కుమారుడు అజయ్ (19) మధ్యాహ్నం కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికిన కనిపించలేదు. కుమారుడు అదృశ్యంపై సింగంశెట్టి హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.