ఏపీలో మరో రైలు ప్రమాదం తప్పింది. మచిలీపట్నం- తిరుపతి ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. రైలు తిరుపతి వెళ్తుండగా బోగీల్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేశారు. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అకస్మాత్తుగా మంటలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.