ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. గత ప్రభుత్వం హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ వైకాపా నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించారు. వారికి పోటీగా టీడీపీ శ్రేణులు సైతం నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.