గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అయ్యంగార్ బేకరీలో పనిచేసే కార్మికుడు సుమంత్ ఆదివారం సాయంత్రం తన రూంలో అనుమానాదస్పదస్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పొన్నూరు అర్బన్ సీఐ మాతంగి బాబి సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని సుమంత్ మృత దేహాన్ని పరిశీలించారు. మృతదేహం నోటి నుంచి, ముక్కుల నుంచి రక్తం బయటికి వచ్చి రూంలో పడి ఉండడాన్ని గమనించారు. స్థానికుల ద్వారా మృతుడి సమాచారాన్ని అతని తల్లిదండ్రులకు చేరవేశారు. మృతుడు రెండు నెలల క్రితమే కర్ణాటక నుంచి పొన్నూరు వచ్చి అయ్యంగార్ బేకరీలో పనిచేస్తున్నాడని సీఐ బాబి తెలిపారు. ఈ సంఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాబి మీడియాకు సోమవారం తెలిపారు.