ప్రకాశం జిల్లా, టంగుటూరు బయలు దేరిన ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండేపి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు తీరుని నిరసిస్తూ నాయుడుపాలెం నుంచి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా టంగుటూరు బయలు దేరారు. అయితే జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి చొక్కా చినిగింది. చివరకు ఎమ్మెల్యే స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. టంగుటూరు వెళ్లాల్సిందే అంటూ జాతీయ రహదారిపై వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.