ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద సీపీఎం నిరసనకు దిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను మోదీ ప్రభుత్వం బలిగొందని విమర్శించారు. కవచ్ లేకపోవడం వల్లే ఒడిశా రైలు ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. జెండాలు ఊపి వందేభారత్ రైళ్లు ప్రారంభించడం కాదు ప్రజల ప్రాణాలను కాపాడాలని హితవుపలికారు. ప్రచార ఆర్భాటాల కోసమే బీజేపీ పరితపిస్తోందని మండిపడ్డారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయన్నారు. మోడీ మాయలు ఆపి ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని బాబురావు వ్యాఖ్యలు చేశారు.