ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరిత ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ హరిత ర్యాలీని ప్రారంభించారు. ఎస్‌వీఆర్ట్స్ కళాశాల నుంచి టౌన్‌క్లబ్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 50 సంవత్సరాలకు ముందు ఉన్న పర్యావరణం ప్రస్తుతం లేదని తెలిపారు. మానవ మనుగడకు పర్యావరణం ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటిద్దామని.. షాపులకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా క్లాత్ బ్యాగులను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు యువత నడుంబిగించాలని జాయింట్ కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు.