కర్నూలు నగరంలోని ఇందిరా గాంధీ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పద్మావతి అనే యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల పదో తేదీన పద్మావతి వివాహం ప్రాతకోటకు చెందిన వినోద్ అనే యువకుడితో జరగాల్సి ఉంది. ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ తరుణంలో పెళ్లి కొడుకు వినోద్ తను ప్రేమించిన యువతితో కలిసి గ్రామం నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పద్మావతి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa