పసుపు పంటను ఈ నెలాఖరు వరకు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు పసుపు తడిచిందని ఇన్నాళ్లు కొనుగోలు చేయని ప్రభుత్వం.. పసుపు సేకరణపై జూన్ 1న ఇచ్చినట్టు చెప్తున్న జీవో ఇంతవరకు సంబంధిత శాఖలకు చేరలేదన్నారు. ఈ నెల 12వ తేదీ వరకే 20వేల టన్నుల పసుపు కొమ్ముల సేకరణ జరుగుతుందని జీవో ఇవ్వడం అసమంజసమని పేర్కొన్నారు. పసుపు సేకరణ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించి, రైతుల వద్ద ఉన్న మొత్తం సరుకు కొనుగోలు చేయాలని ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.