వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏపీ వీఆర్‌ఏ సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏ) ఇచ్చిన హామీ విషయంలో సీఎం జగన్ మాట మార్చి మడమ తిప్పారని విమర్శించారు. విజయవాడలోని రాష్ట్ర ఉపాధ్యాయ భవన్‌లో సంఘం రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ వీఆర్‌ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేదంటే ఉద్యమ కార్యచరణ రూపొందించి పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. నల్లిపోగు నాగేశం ప్రధాన కార్యదర్శిగా ఇరుపోతు శ్రీనివాసులు వర్మ కోశాధికారిగా, కొమ్మది ఈశ్వరయ్య ఉపాధ్యక్షుడిగా 13 మందితో సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.