కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఓ గోసంరక్షణ శాలలో కాంగ్రిజ్ జాతికి చెందిన ఆవు ఆదివారం రెండు దూడలకు జన్మనిచ్చింది. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి పెద్ద పండుగగా భావించి పూజించే రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఆవుకు కవల దూడలు పుట్టడం సకల శుభాలకు సూచనగా భావించిన స్థానికులు వాటిని చూసేందుకు తరలివచ్చి గోపూజ చేశారు.