జగన పాలనలో రైతులు అప్పులపాలయ్యారని, పంట నష్టపోతే రైతులను పరామర్శించే దిక్కుకూడా లేదని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. ఆదివారం రామగిరి మండలంలోని మాదాపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పంటల సాగును ఆమె ప్రారం భించారు. ఆమె రైతులు, మహిళలతో కలిసి వ్యవసాయ పనిముట్లు, కాడెద్దులు, భూమికి సంప్రదాయబద్దంగా పూజలు చేసి విత్తనం విత్తారు. ఈ సందర్బంగా ఆమె ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి గిట్టుబాటు ధర లభించాలని ఆకాంక్షించారు. రైతు ల ఇబ్బందులను గుర్తించి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ప్రకటించారన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయాన్ని పండుగలా చేస్తార న్నారు. ఈసందర్బంగా పొలంలో ప్లకార్డులు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.