పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఆదివారం ఉదయం చినభోగిలి గ్రామంవద్ద రాష్ట్రీయ రహదారిపైన ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుండి కొమరాడ అతి వేగంతో వస్తున్నకారు ఒక్కసారి ముందున్న కుడివైపు టైర్ పంచర్ కావడంతో జోగమ్మపేట నుండి బొబ్బిలి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొంది. ఈప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయింది. ఆటో కూడా బోల్తాపడగా దాని ముందు భాగం కొంత దెబ్బతింది. జరిగిన సంఘటన చూస్తే కారులో ముందుఉన్న డ్రైవర్, ఓనర్ మృతి చెందిఉంటారని బావిస్తారు. కానీ నేటి సాంకేతిక పరిజ్ఞానంతో వారిద్దరు రోడ్డు నియమాలు పాటించడం వల్ల రెండు ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో వారిద్దరికీ చిన్న గాయాలు కూడా తగల లేదు. దీంతో పాటు అతివేగంగా వస్తున్న కారు ఆటోను డీకొనగా ఆటో పలు పల్టీలు కొట్టి దానిలో అంతా మృతిచెందే పరిస్తితి ఉన్నప్పటికీ ఇటీవల అక్కడ రైల్వే లైన్ పనులు జరుగుతుండటంతో రోడ్డుకు ప్రక్కన వారు వేసిన కర్రల కంచె ఆటో తిరగబడకుండా కాపడాయి.
సీతానగరం పొలీసులు ప్రసాద్, రామకృష్ణ, యుగంధర్ లు సంఘటన స్థలానికి చేరుకుని క్షత గాత్రులను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించే చర్యలు తీసుకున్నారు. నిలిచిన వాహనాలు రాకపోకలను పునరుద్ధరణ చేశారు. కారు, ఆటోలను పోలీస్ స్టేషన్ కు ట్రాక్టర్, జెసిబి సహాయంతో తరలించారు. మండలం జోగింపేట గ్రామానికి చెందిన సోంబారికి లక్ష్మి కూలిపని చేసుకొంటుంది. ఆదివారం ఉదయం తనభర్త కిరణ్ తో కలసి ఆటోలో కాశీపేట వెళ్తుండగా మార్గమధ్యలో కొంతమంది ఆటో ఎక్కారు. చినబోగిలి ఎస్సీకాలనీ దగ్గర మెయిన్ రోడ్ పై ఆటోను ఎదురుగా పార్వతీపురం వైపు అతివేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఆటో రోడ్డుపై బోల్తా పడింది. ఈప్రమాదంలో లక్ష్మికి, ఆమె భర్త కిరణ్ కు, ఆటోలో ప్రయాణిస్తున్న గెడ్డలుప్పి గ్రామానికి చెందిన అల్లుచిన్నారావు, బొంగుల సంజీవి నాయుడుకు, విజయనగరం జిల్లా సారిక గ్రామానికి చెందిన కారు డ్రైవరు సువ్వాడ సందీప్ కుమార్, కారులో ప్రయాణిస్తున్న బి. ఇందిరకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారికి జిల్లా వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఔట్ పోస్టు పోలీసులు వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణంచేస్తున్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావుకు ఎటువంటి గాయాలు తగలకుండా బయట పడ్డారు. అతని భార్య ఇందిరకు చిన్న చిన్న గాయాలు తగిలాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ. ఎస్ఐ లంక శ్రీనివాసరావు తెలిపారు.